Magazines

చిరునామా తప్పిపోయింది ...!

1 గంట క్రితం

Address
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 2 నిమిషాల చదవడం

ఇంటి చిరునామా ఏమీ మారలేదు అదే ఇల్లు, అదే ఇంటి నెంబర్, అదే అరుగు, అదే వాకిలి, అదే వీధి చిరునామా పాతదే... ఐనా, నా మాటలన్నీ గాలితో పాటే ఎటో ఎగిరిపోతాయి చిరునామా లేని ఏ ఇంటికో, ఏ వీధికో ఏడు పదుల వయసు దాటినా ఇంటి ముందు రోడ్డు మారలేదు, వీధి దారి మారలేదు రోడ్డుకానుకొని వున్న మంచి నీటి కాలువ కాస్త మురికి కాలువగా మారింది, కానీ, దాని చిరునామా మారలేదు! అప్పుడప్పుడు అదే నా చిరునామాగా మారుతుంది. ఎవరైనా ఫలానా వారి ఇల్లెక్కడా? అని అడిగితె 'అదిగో ఆ మురికి కాల్వ పక్కనే' అంటారు. పాపం! వీధి దారి పక్కన పారే ఆ సన్నటి మురికి కాలువ చిరునామా లేని ఆవాసాల నుండి వచ్చే మురుగు నీటిని తన భుజాలపై ఇంకా మోస్తూనే వుంది ధ్వంసమైపోతున్న తన అస్తిత్వాన్ని ఏమీ చేయలేని నిస్సహాయతలో...! ఇంటి ముందు ఎత్తైన అరుగు నాలాగే ఒరిగిపోయింది ఇంటి పై కప్పు శిథిలమై జ్ఞాపకాల పుప్పొడిలా పొడిపొడిగా రాలిపోతూ వుంది.

నా తరం మనుషులు కొందరు కాలంతో పాటే తమ చిరునామాలను వదిలిపోయారు పెళ్ళికూతురిలా వెలిగిపోయిన ఇల్లు కళ తప్పిన వృద్ధ వనితలా బీటలు బారిన దేహంతో వుంది తరం మారింది, మనుషులు మారారు, మనసు లోపల మౌనం, ఇంటి లోపల నిశ్శబ్దం... దేహం తెల్ల రక్త కణాలతో మత్తడి పారుతుంది ఐనా, ఇంటి చిరునామా ఏమీ మారలేదు! అదే ఇల్లు, అదే ఇంటి నెంబర్, అదే అరుగు, అదే వాకిలి, అదే వీధి చిరునామా మారలేదు! ఐనా పోస్టుమ్యాస్ ఇటువైపు రావడమే మర్చిపోయాడు మా వాడలోని వారందరి జ్ఞాపకాలు, పలకరింపులతో నిండిన సంచిని భుజాన మోసుకుని రావడమే మర్చిపోయాడు! బహుశా అతని సంచి నుండి నా చిరునామా ఎక్కడో జారి పడిపోయి వుండవచ్చు ...ప్స్ ఇప్పుడు, నాలుగు తరాలను తడిమిన పోస్టు కార్డులు చెదలు పటిన పట్టిన కప్పు దూలానికి ఓ మూల ఇనుప తీగె పై పై జ్ఞాపకాలుగా వేలాడుతూ... ఆ పాత ఉత్తరాల కవిలె కట్టలో ఇగ తప్పిపోయిన నా చిరునామాను ఎవరైనా వెతికిపెడతారా?!

- డా. రూప్ కుమార్ డబ్బీకార్, 9177857389

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్