నవతెలంగాణ మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న ఓ పెయింట్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణం ముందు భాగంలో సైన్ బోర్డు ఏర్పాటు చేసేందుకు వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెల్డింగ్ సందర్భంగా ఎగిసిన నిప్పురవ్వలు ప్రమాదవశాత్తు అక్కడున్న రసాయనాలు, పెయింట్ డబ్బాలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు దుకాణమంతటా వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
మియాపూర్ పెయింట్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
25 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)