Magazines

ఆపదలో ఉన్న కుటుంబాలకు ఎమ్మెల్యే జారె అండ

1 గంట క్రితం

families in distress
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

- 156 మంది బాధితుల వైద్య బిల్లులు సీఎంఆర్‌ఎఫ్‌కు సమర్పణ

నవతెలంగాణ - అశ్వారావుపేట

నియోజకవర్గ పరిధిలోని ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అండగా నిలుస్తున్నారు. 

అనారోగ్య సమస్యలతో వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.


ఈ క్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం సంప్రదించిన 156 మంది బాధితులకు సంబంధించిన వైద్య బిల్లులను మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ విభాగం అధికారులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందలేని నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్