జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు
నవతెలంగాణ-వర్ధన్నపేట
ఆయిల్ ఫామ్ వేసిన రైతులు జూన్ మాసం వరకు ఎల్ నినో ప్రభావం పై అప్రమత్తంగా ఉండాలని భవిష్యత్తులో ఆల్ఫా రైతులకు మంచి దిగుబడులు ఉంటాయని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస రావు అన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఆయిల్ ఫామ్ రైతులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఆయిల్ ఫామ్ రైతుల మండల కమిటీ అధ్యక్షులు తక్కలపల్లి సత్యనారాయణ క్షేత్రాన్ని రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ మొక్కలకు జూన్ వరకు వేసవి వేడి ప్రభావం పడకుండా నిరంతరం తేమ ఉండేలా చూసుకోవాలని సూచించారు.
చెట్ల చుట్టూ నాలుగు వైపుల జెట్ల ద్వారా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి ఉదయం, సాయంత్రం నీరు అందించాలని, మల్చింగ్ చేయడంతో పాటు పశువుల ఎరువును వినియోగించాలని తెలిపారు. రైతుల్లో ఆయిల్ ఫామ్ సాగుపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో నర్సరీల్లో మొక్కల కొరత ఏర్పడుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఆర్థికంగా మంచి ప్రయోజనాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని వరి సాగుకు బదులుగా కందులు, పెసలు, పల్లీలు, మినుములు, కుసుమ వంటి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన మండల ఆయిల్ ఫామ్ కమిటీ సభ్యులను, అధ్యక్షుడు తక్కళ్లపల్లి సత్యనారాయణ రావును అధికారులు అభినందించారు. కార్యక్రమంలో మండల ఉద్యానవన అధికారి వేణు మాధవ్, రుషి, మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, గౌరవ అధ్యక్షుడు గుజ్జ గోపాల్ రావు, ఉపాధ్యక్షులు పెంచాల కుమారస్వామి, బోయినపల్లి దేవేందర్ రావు, జన్నాపురెడ్డి సురేందర్ రెడ్డి, కోశాధికారి నాంపల్లి మల్లేశం, సహాయ కోశాధికారి తిరుపతి రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవ రెడ్డి, నారాయణ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు మునుకుంట్ల ఐలయ్య, దేవేందర్ రావు. వివిధ గ్రామాలకు చెందిన ఆయిల్ ఫామ్ రైతులు హాజరయ్యారు.






కామెంట్లు (0)