Magazines

తుఫాను ప్రభావిత పంటచేలను ఎమ్మెల్యే క్షేత్రస్థాయి సందర్శన

1 గంట క్రితం

sattupalli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- ప్రభుత్వ పరంగా బాధ్యత రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాలను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట పొలాలు నీట మునిగాయి. పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పరామర్శించారు. 

నీట మునిగిన వరి పొలాలను, నిలిచిన వర్షపు నీటిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంట వివరాలను, వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని రైతులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్యంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పంట నష్టంపై వెంటనే సమగ్ర నివేదిక తయారు చేయాలని వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రైతులకు న్యాయం జరిగేలా పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలన్నీ వేగవంతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, 

వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖల అధికారులు సత్తుపల్లి, వేంసూరు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్