ముదిరాజ్ లను బిసి-డి నుండి బిసి-ఏ లోకి మార్చాలి

2 గంటల క్రితం

Mudiraj
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

ముదిరాజ్ మహాసభ యువత జిల్లా అధ్యక్షుడు..పోతరవేని క్రాoతి.

నవతెలంగాణ-మల్హర్ రావు

ముదిరాజులను బిసి-డి వర్గం నుంచి బిసు-ఏ వర్గంలోకి మార్చి, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర రిజర్వేషన్లు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు విన్నవించారు. ఈ మేరకు ముదిరాజ్ మహాసభ యువత జిల్లా అధ్యక్షుడు పోతరవేని క్రాంతి శుక్రవారం మంత్రికి వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజ్ సమాజం రాష్ట్రంలో గణనీయమైన జనాభా కలిగి ఉన్నప్పటికీ, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అనేక సంవత్సరాలుగా వెనుకబడిందన్నారు. బిసి-డి నుంచి బీసీ-ఏ కు మార్చాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం బిసి వర్గాలను వివిధ ఉపవర్గాలుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఈ మేరకు ముదిరాజులను బిసిఏ వర్గంలోకి మార్చి, రిజర్వేషన్లు, ప్రభుత్వ ఫలాలు అందేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్