Magazines

ముదిరాజులని బిసి ఏ లో మార్పుకు కమిటీ వేయడం హర్షనీయం 

2 గంటల క్రితం

changes in the BCA
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను

ముదిరాజులని బీసీ ఏ లో చేర్చేందుకు కమిటీ వేయడం హర్షనీయమని, మత్స్యశాఖ పట్టణ అధ్యక్షులు, భరిగే శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ముదిరాజుల సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.


పండగ సాయన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తామని చెప్పడం ముదిరాజులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. అదేవిధంగా ముదిరాజ్ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే అంశంపై ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం ఆశాజనకమన్నారు. ఇన్నేళ్లుగా ముదిరాజ్ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించడం హర్షణీయమన్నారు.

ముదిరాజుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి, ఘన విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్