నవతెలంగాణ-మర్రిగూడ : మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షులు గ్యార కాశయ్య సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య తో కలిసి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మిషన్ భగీరథ లో పనిచేస్తున్న కార్మికులు చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.అదేవిధంగా స్కానర్ సిస్టం కూడా తొలగించాలని లేదా ఆ లైన్మెన్ పని చేసే చోటనే స్కానర్ సిస్టం పెట్టాలని తెలిపారు.ఇచ్చే వేతనం ప్రతినెల మొదటి తారీకు ఇవ్వాలని,ఎనిమిది గంటల పని దినాలు కేటాయించాలని,తదితర అంశాలను వినతి పత్రంలో పొందుపరిచి జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడం జరిగిందని పేర్కొన్నారు.
మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ వినతి
19 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)