Magazines

ఫార్డి కే గ్రామంలో సప్తమి వేడుకలు ప్రారంభం

1 గంట క్రితం

Saptami
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని ఫార్డి కే గ్రామంలో దక్షణ హనుమాన్ ఆలయంలో ఆదివారం గ్రామస్తులు వేద పండితులతో కలసి తాళ సప్తమి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలు ఏడు రోజుల పాటు మందిరంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు  రాత్రి 9 గంటల నుండి కీర్తనకారులచే భక్తి కీర్తనలను ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజన కార్యక్రమాలు ఆలపించనున్నారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్