వాటర్ వర్క్స్ జీఎం సంతోష్‌కు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ – నాచారం:
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పాత గ్రామాల ప్రజలకు అధికంగా వస్తున్న నీటి బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.ఈ మేరకు వాటర్ వర్క్స్ జీఎం సంతోష్‌తో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించి పలు సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా కుషాయిగూడ,చర్లపల్లి,నాచారం,మల్లాపూర్ ప్రాంతాల్లోని గ్రామకంఠం పరిధి ప్రజలకు ఇతర ప్రాంతాలతో పోలిస్తే అధిక మొత్తంలో నీటి బిల్లులు వస్తున్నాయని జీఎం దృష్టికి తీసుకెళ్లారు.ఎన్నో ఏళ్లుగా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న పాత గ్రామాల ప్రజలు అధిక నీటి బిల్లులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రజలపై అనవసరమైన ఆర్థిక భారం పడకుండా బిల్లుల విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.నీటి మీటర్ల పనితీరు,వాస్తవ వినియోగం,బిల్లుల లెక్కింపులో తలెత్తుతున్న వ్యత్యాసాలను పరిశీలించి వినియోగానికి అనుగుణంగా బిల్లులు జారీ చేయాలని కోరారు.
ఈ సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచించారు.ప్రజలకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను కోరారు.






కామెంట్‌లు (0)