Magazines

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

16 నిమిషాల క్రితం

development
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ 

నవతెలంగాణ-నెల్లికుదురు 

పేదలను అన్ని రంగాలుగా అభివృద్ధి పరచడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బెజ్జం యాకలక్ష్మి వెంకటాద్రికి చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, భీమా పథకం, ఉచిత విద్యుత్తు ,ఇలా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు.


ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎదెల యాదవ రెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాయని సత్యపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, ఉప సర్పంచ్ పిట్టల ఉప్పలయ్య,తాళ్ల మునేష్ ,తాళ్ల సరిత, జిల్లా ఎల్లమ్మ, బెజం పెరుమయ్య, జిల్లా మండల నాయకులు మద్ది రాజేష్ ,ఆకుతోట సతీష్, గుదే యుగేందర్, పెరుమాండ్ల మల్లేష్, జల వెంకటేష్, చేన్నబోయిన శ్రీనివాస్ ,పెరుమాల శంకర్ , గుగులోతు మధు 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్