- యూకే మాజీ ఎంపీ చేతుల మీదుగా ప్రశంసలు
నవతెలంగాణ హైదరాబాద్/వరంగల్: అంతర్జాతీయ స్థాయిలో మన తెలంగాణ యువత మరోసారి తమ ప్రతిభను చాటుకుంది.వరంగల్ నగరానికి చెందిన యువకుడు కొంగర ప్రిన్స్ విజయ్ సంతోష్ (డా.కొంగర విజయ భాస్కర్ కుమారుడు)లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో ఉన్న ప్రతిష్ఠాత్మక యూకే (UK)పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన 'GSS ESG సేఫ్టీ అవార్డ్స్ &కాన్ఫరెన్స్'లో డెలిగేట్‌గా పాల్గొని అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
ఈ సదస్సు వేదికగా ప్రిన్స్ విజయ్ సంతోష్ తన ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యునైటెడ్ కింగ్డమ్ మాజీ పార్లమెంట్ సభ్యులు వీరేంద్ర శర్మ ప్రిన్స్‌ను ప్రత్యేకంగా అభినందించి,సర్టిఫికెట్‌ను అందజేశారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆశీర్వదించారు.ఈ అంతర్జాతీయ సదస్సులో BSI,ది కార్బన్ ట్రస్ట్,కావో డేటా,ఎన్వెస్టర్స్,బ్రిటిష్ అమెరికన్ టొబాకో వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు పాల్గొని భద్రత,సుస్థిరత మరియు అభివృద్ధి అంశాలపై కీలక చర్చలు జరిపారు.
ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎంబీఏ (MBA)చదువుతున్న ప్రిన్స్ విజయ్ సంతోష్,అక్కడి ఈస్ట్ లండన్ స్టూడెంట్స్ యూనియన్‌కు డైరెక్టర్‌గా మరియు స్టూడెంట్ ట్రస్టీగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అంతకుముందు 2025లో వరంగల్‌లోని ఎస్ఆర్ (SR)యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్)విభాగంలో బీటెక్ (B.Tech)పూర్తి చేశారు.సాధారణ స్థాయి నుండి అంతర్జాతీయ పార్లమెంట్ వేదిక వరకు ఎదిగిన ప్రిన్స్ ప్రస్థానం వరంగల్ మరియు తెలంగాణ ప్రాంత యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.







కామెంట్లు (0)