Magazines

అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం: ఎంపీడీఓ

1 గంట క్రితం

pensions
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్

అర్హులైన పేదలందరికీ పింఛన్లు అందిస్తామని ఎంపీడీవో లక్ష్మణ్ చెప్పారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి 516 మంది లబ్దిదారులు పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇందులో 437 మందికి పింఛన్ మంజూరైనట్లు చెప్పారు. మిగతా 79 మంది దరఖాస్తులు ఆన్లైన్లో కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే జిల్లా అధికారులతో మాట్లాడి అర్హులైన పేదలందరికీ పింఛన్లు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్