Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుకుల కళాశాలను సందర్శించిన జిల్లా నోడల్ అధికారి

గురుకుల కళాశాలను సందర్శించిన జిల్లా నోడల్ అధికారి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల బాలుర జూనియర్ కళాశాలను కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియెట్ డిఐఈఓ (జిల్లా ఇంటర్ విద్యానోడల్ అధికారి) షేక్ సలీం ఆకస్మికంగా సందర్శించారు. ఇంటర్మిడియెట్ కు సంబంధించిన ఇంటర్ విద్యార్థుల అడ్మీషన్ రిజిస్టర్ ను పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరానికి కావలసిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియెట్ కు సంబంధించిన‌ అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కు సూచించారు.

ఇంటర్మీడియెట్ బోధన తరగతి గదులను, ప్రాక్టికల్స్ కోసం సిద్ధం జేసిన భౌతిక రసాయన జీవ జంతు శాస్త్రాల ప్రయోగశాలలను పరిశీలించారు. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు. రాబోయే విద్యా సంవత్సరానికి కావాల్సిన అన్ని వసతులను కల్పించాలని సూచించారు. యం పీ సీ, బైపీసీ  ఆంగ్లమీడియంలో మంచి ప్రావీణ్యం గల విద్యార్థులను ఎంపిక జేసుకోవాలని చెప్పారు.

ఆయనతోపాటు ప్రిన్సిపాల్ ఏ సుధాకర్,వైస్ ప్రిన్సిపాల్ ,ప్రముఖ పద్యకవి డా బి.వెంకట్, అధ్యాపకులు – కే సంతోశ్, దత్తాత్రేయ,జే గణేశ్, నాగరాజు,శివకళ,మనోహర్, శివాజీ ,ఉమాకాంత్ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -