- Advertisement -

నవతెలంగాణ–జక్రాన్ పల్లి
ప్రభుత్వ సలహాదారున నియమితులైన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారినీ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతిరెడ్డి, మాజీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గోర్త రాజేందర్ తో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటిపల్లి నాగేష్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ ఛైర్మెన్ మునిపల్లి సొసైటీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మునిపల్లి తాజా మాజీ సర్పంచ్ చిన్న సాయిరెడ్డి, తొర్లికొండ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఉత్కం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



