Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస్టల్లో క్యాంపును తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

హాస్టల్లో క్యాంపును తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలము అనంతారం గ్రామ శివారులో ఉన్న మహాత్మ జ్యోతి పూలే హాస్టల్లో నిర్విహిస్తున్న మెడికల్ క్యాంపు ను జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు ను పరిశీలించారు. హాస్టల్ విద్యార్థులకు ఉన్నటువంటి రుగ్మతలకు చికిత్స విధానాన్ని పరిశీలించారు .పరిసరాలు పరిశుభ్రత ,వ్యక్తిగత పరిశుభ్రతతో పిల్లలకు  ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్,యమిని శృతి,పల్లె దవాఖాన డాక్టర్లు మురళి మోహన్ , అనిల్, పుష్ప సురేష్ కుమార్, ఆశా కార్యకర్తలు శోభ ,లింగలక్ష్మీ అరుణ, విజయ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -