Wednesday, March 25, 2026
E-PAPER
HomeNewsతెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్ ఓ…

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్ ఓ…

- Advertisement -

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్

భువనగిరి మండలం, పట్టణ శివారులో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల ను ఆకస్మికంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వంటగదిని, స్టోర్ రూమ్ ను బోధనశాలను, విద్యార్థులను అడిగి వివరాలన్నీ తెలుసుకున్నారు పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారము తోపాటు వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని, వారికి ఆరోగ్య విద్యా బోధన చేశారు పిల్లలు మానసిక ఒత్తిడి పరీక్షల పై భయం పడకుండా టెలి మానస్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సిబ్బందిని కోరారు.

సిబ్బందితో మాట్లాడుతూ పిల్లలను జాగ్రత్తగా అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, తమ వైద్య సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ యాకయ్య, వార్డెన్ మాజాయిద్దీన్, పల్లె దవాఖాన వైద్యుడు డాక్టర్ మురళీమోహన్, సురేష్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -