Monday, November 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనూతన విద్యా విధానం ఆమోదించొద్దు

నూతన విద్యా విధానం ఆమోదించొద్దు

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్పీటీఏ వినతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఛాందస ఉన్మాద సిద్ధాంతాలతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఆమోదించవద్దని తెలంగాణ స్టేట్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్‌ షౌకత్‌ అలీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యనిర్వాహక కౌన్సిల్‌ సమావేశంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. యంగ్‌ ఇండియా పేరుతో నూతన విద్యా విధానాన్ని ఆమోదించేలా ఏర్పాట్లు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వాలు బలవంతంగా నూతన విద్యా విధానం అమలు చేయాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రజాస్వామికవాదులు, మేధావులు వ్యతిరేకించాలని కోరారు.

గతంలో ఇలాంటి వ్యతిరేకత వల్లే పక్కన పెట్టిన ఆ విధానాన్ని సీఎం చాపకింద నీరులా అమలు చేయాలని చూస్తున్నారని తెలిపారు. 10 వేల ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులను, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రాష్ట్ర శాఖ కార్యవర్గంలో స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఐదు ఖాళీలను భర్తీ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇప్పటి వరకు ఇంచార్జీ ఉన్న ఉప ప్రధాన కార్యదర్శి ఆర్‌.రోహిత్‌ నాయక్‌ను ప్రధాన కార్యదర్శిగా ఆమోదించారు. నూతన కార్యదర్శి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం విద్యారంగంలో ఉన్న 15 అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తీర్మానాలు ఆమోదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -