Friday, August 28, 2026
E-PAPER
Homeజాతీయంమ‌రో 25 ఏండ్ల వరకు లోక్‌స‌భ‌ స్థానాలు పెంచొద్దు

మ‌రో 25 ఏండ్ల వరకు లోక్‌స‌భ‌ స్థానాలు పెంచొద్దు

- Advertisement -

రాష్ట్రాలవారీగా ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని అలాగే కొనసాగించండి
1/3 మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెట్టండి : ప్రధాని మోడీకి కాంగ్రెస్‌ అధ్యక్ష‍ుడు ఖర్గే లేఖ

మ‌రో 25 ఏండ్ల వరకు 
లోక్‌స‌భ‌ స్థానాలు పెంచొద్దురాష్ట్రాలవారీగా ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని 
అలాగే కొనసాగించండి
1/3 మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెట్టండి :
ప్రధాని మోడీకి కాంగ్రెస్‌ అధ్యక్ష‍ుడు ఖర్గే లేఖ


నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
రాబోయే 25 ఏండ్ల వరకు లోక్‌సభ స్థానాలు పెంచొద్దని రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల సంఖ్యా బలాన్ని అలాగే కొనసాగించాలని, రాష్ట్రాల వారీగా లోక్‌స‌భ సీట్ల కేటాయింపు అలాగే కొనసాగించాలని సూచించారు. అంతేకాకుండా 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 1/3 రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మోడీకి రెండు పేజీల లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసే ఆస్కారం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ లేఖను రాస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. డీలిమిటేషన్ (నియోజక వర్గాల పునర్విభజన) ప్రక్రియపై చర్చించేందుకు అఖిలప‌క్ష‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలను అధ్యయనం చేయడానికి రాజకీయ పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జూలై 16న ప్రధానికి రాసిన లేఖలోని అంశాలను పున:రుద్ఘాటించారు. డీలిమిటేషన్ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందన్నారు.​బుల్డోజ్‌కు ప్రయత్నిచొద్దు​డీలిమిటేషన్ అనేది దేశానికి అత్యంత ప్రాముఖ్యం కలిగిన అంశమని ఖర్గే గుర్తుచేశారు. ఈ విషయంలో అన్ని పక్షాలతో సంప్రదంపులు జరపకుండా ప్రతిపాదనలపై ముందుకు వెళ్లవద్దని సూచించారు. ‘డీలిమిటేషన్ పై పార్లమెంట్ లో ఈ ఏడాది ఏప్రిల్ 16, 17 తేదీల్లో మాదిరిగా బుల్డోజ్ చేసే ప్రయత్నాలు చేయొద్దు. ఈ అంశం జనాభా ఆధారంగా లోక్ సభ స్థానాల సరిహద్దులతో ముడిపడిన అంశం’ అని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -