నవతెలంగాణ – ముధోల్
భూమి కోసం, భూక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసంతెలంగాణ రైతంగాం సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాటం మరువలేనిది అని మాజీ ఎంపిటిసి దేవుజీ భూమెష్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో కురుమ సంఘం ముధోల్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 79 వర్థంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కొమరయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. రజాకార్ల పాలనలో దొరల గడీల పాలన అంతము చేయడానికి తుపాకీ తూటలకు ఏదురోడ్డి తెలంగాణ సాధనకై అమరుడైన మన వేగుచుక్క దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. వారి ఆశయ సాధనకై మనమందరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెత్రి విట్టల్, ఊరేకర్ సాయన్న, నర్సయి బీరప్ప, శివాజీ, బీరన్న, చిన్న విట్టల్, దేవుబాయ్, సంఘం సభ్యులు, పాల్గొన్నారు.