Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఅలా చేయడం.. ఎవరికైనా మంచిది

అలా చేయడం.. ఎవరికైనా మంచిది

- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్మాత సాహు గారపాటి మీడియాకి వచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..

ఈ కథలో మిమ్మల్ని బాగా ఎగ్టైట్‌ చేసింది ఏంటి?
ఇది చాలా ఇంట్రెస్టింగ్‌ హర్రర్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న కథ. ఇప్పటివరకు చాలా హర్రర్‌ సినిమాలు వచ్చాయి. అయితే ఈ కథ మాత్రం చాలా యూనిక్‌గా ఉంటుంది. హర్రర్‌ థ్రిల్లర్‌, హర్రర్‌ మిస్టరీ ఈ రెండింటి బ్లెండ్‌తో చాలా కొత్త కథ చెప్పారు దర్శకుడు. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్‌, దాని చుట్టూ ఉండే హర్రర్‌ ఎలిమెంట్స్‌ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి హారర్‌ థ్రిల్లర్‌ రాలేదు.

కథ విన్నప్పుడు కలిగిన ఎగ్జైట్‌మెంట్‌ ఫస్ట్‌కాపీ చూసిన తర్వాత అదే స్థాయిలో కలిగిందా?
కచ్చితంగా. కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్‌మెంట్‌ కలిగిందో, సినిమా చూసిన తర్వాత ఆ ఎగ్జైట్‌మెంట్‌ ఇంకా పెరిగింది. ఈ సినిమాకి అందరూ టాప్‌ టెక్నీషియన్స్‌ పనిచేశారు. ‘యానిమల్‌’, ‘పుష్ప’ సినిమాలు చేసిన టెక్నీషియన్స్‌ మిక్సింగ్‌ చేస్తున్నారు. రన్‌ టైం కూడా చాలా క్రిస్ప్‌గా ఉంటుంది. తప్పకుండా ఆడియన్స్‌ ఎంగేజ్‌ అవుతారు.

సాయి శ్రీనివాస్‌ తొలిసారి హర్రర్‌ సినిమా చేస్తున్నారు కదా.. ఎలా అనిపించింది?
సాయి శ్రీనివాస్‌ ఇప్పటి వరకు కమర్షియల్‌, మాస్‌ సినిమాలు చేశారు. ఈ సినిమాలో ఆయన ప్రజెన్స్‌ చాలా కొత్తగా ఉంటుంది. ఈ కథకి ఆయన పూర్తి న్యాయం చేశారు. ఇందులో రెండు యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయి. ఫస్ట్‌హాఫ్‌ కొంత ఎంటర్టైన్మెంట్‌ ఉంటుంది. సెకండ్‌ హాఫ్‌ నుంచి సీరియస్‌ హర్రర్‌ ఫిల్మ్‌గా టర్న్‌ అవుతుంది. ‘కిష్కిందపురి’ అని ఊరిలో జరిగే కథ కాబట్టి ఈ సినిమా కోసం రెండు కోట్లతో భారీ సెట్‌ వేశాం.

డైరెక్టర్‌ కౌశిక్‌ గురించి?
కౌశిక్‌ చాలా మంచి నేరేటర్‌. కథని చాలా అద్భుతంగా చెబుతాడు. చాలా మంచి మేకర్‌. మోడరన్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ స్టయిల్‌తో సినిమాని తీశారు.

అనుపమ ఎంపిక ఎవరిది?
తనకి ఎప్పటినుంచో ఇలాంటి హర్రర్‌ కంటెంట్‌ చేయాలని ఉండేది. ఈ సినిమాకి ఫస్ట్‌ ఛాయిస్‌ తనే. కథ వినగానే ఓకే చెప్పారు. తనకి ఈ సినిమాలో మంచి పెర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ క్యారెక్టర్‌ దొరికింది. తన క్యారెక్టర్‌ అద్భుతంగా ఉంటుంది.

ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినివ్వ బోతోంది?
ఈ సినిమా చూసిన ఆడియన్స్‌ తప్పకుండా మంచి థ్రిల్‌ ఫీల్‌ అవుతారు. విజువల్‌, మ్యూజికల్‌గా చాలా ఎగ్జైట్‌మెంట్‌ ఉంటుంది.చాలా షాక్‌ ఫ్యాక్టర్స్‌, ఆడియన్స్‌ భయపడే మూమెంట్స్‌ చాలా ఉన్నాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. హాలీవుడ్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. టెక్నికల్‌గా సినిమా టాప్‌ నాచ్‌లో ఉంటుంది.

సెన్సార్‌ రిపోర్ట్‌ ఏమిటి?
సెన్సార్‌ ఎలాంటి కట్స్‌ ఇవ్వలేదు. సీరియస్‌ హర్రర్‌ సినిమాని చాలా ఎంగేజింగ్‌గా చేశారు. చాలా బాగుంది అని అప్రిషియేట్‌ చేశారు. వారి ప్రశంస ఎంతో సంతోషాన్నిచ్చింది.

బిజినెస్‌ ఎలా జరిగింది, ప్రీమియర్స్‌ వేసే ఆలోచన ఉందా?
ఈ విషయంలో మేం చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాం. ప్రీమియర్స్‌పై సోమవారం నిర్ణయం తీసుకుంటాం.

మీరు పెద్ద, చిన్న సినిమాలను బ్యాలెన్స్‌ చేసి తీయాలనే ఆలోచనలో ఉన్నారా?
మేము పెద్ద సినిమాలే చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమాలు బడ్జెట్లో అవుతాయని తెలిస్తేనే చేయడం ఎవరికైనా మంచిది.

‘భగవంత్‌ కేసరి’ సినిమా చేస్తున్న టైమ్‌లో నేషనల్‌ అవార్డు వస్తుందని ఊహించారా?
నేషనల్‌ అవార్డు వస్తుందని అను కోలేదు. కానీ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఎప్పుడు కూడా ఆ సినిమా తనకి ప్రత్యేక మైన సినిమా అని చెబుతుండేవాడు. ఒక పెద్ద హీరోతో ఇంత మంచి సందేశాత్మక పాయింట్‌తో కమర్షియల్‌ సినిమా అద్భుతంగా కుదిరిందని అంటుండేవారు. కచ్చితంగా దీనికి చాలా మంచి అప్రిషియేషన్‌ వస్తుందని తన నమ్మకం. ఆ నమ్మకం నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది.

ఇటీవల జరిగిన సమ్మె ఎఫెక్ట్‌ సంక్రాంతికి రాబోయే మీ సినిమా మీద పడిందా?
15 రోజుల షూటింగ్‌ ఎఫెక్ట్‌ అయింది. అయితే ఆర్టిస్టులందరూ ఫుల్‌ సపోర్ట్‌ చేస్తున్నారు. కొత్త షెడ్యూల్‌ మొదలైంది. నవంబర్‌ 15కి సినిమా షూటింగ్‌ పూర్తి అయిపోతుంది. సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నాం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad