Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగృహ వినియోదారులు భయపడాల్సిన అవసరం లేదు

గృహ వినియోదారులు భయపడాల్సిన అవసరం లేదు

- Advertisement -

తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై గృహ వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ (టీఎల్‌డీఏ) విజ్ఞప్తి చేసింది. ‘ప్రశాంతంగా ఉండండి. సహనంతో వ్యవహరించండి. డిస్ట్రిబ్యూటర్లకు సహకరించండి’ అని కోరింది. ఈమేరకు అసోసియేషన్‌ అధ్యక్షులు కె. జగన్‌మెహన్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న సంఘర్షణ కారణంగా ప్రపంచ స్థాయిలో ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు.

సాధారణంగా బుకింగులతో పోల్చితే ప్రస్తుతం 250శాతం నుంచి 300 శాతం బుకింగులు పెరిగాయని తెలిపారు. దీని ఫలితగా డెలివరీ సమయం గతం కంటే ఒకటి రెండు రోజుల నుంచి ఆరేడు రోజుల సమయం పడుతోందని పేర్కొన్నారు. కొన్ని రోజులు ఓపిక పడితే సిలిండర్‌ డెలివరీ వినియోగదారుల ఇంటికి వస్తోందని భరోసా ఇచ్చారు. గోడౌన్ల నుంచి బలవంతంగా సిలిండర్లు తీసుకు వెళ్లడం దోపిడీ అవుతోందని అభిప్రాయపడ్డారు. తమ సిబ్బందిని బెదిరించడాన్ని, అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ పరీక్షా సమయంలో వినియోగదారులు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -