- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు ఓటు చోరీకి వ్యతిరేకంగా డోంగ్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు చోర్ చోర్ అనీ నినాదంతో మహా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, ఆ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ముఖ్యమైన నాయకులు చోరీకి వ్యతిరేకంగా నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓట్లు దోచుకునే బీజేపీ దానికి వత్తాసు పలికే ఎన్నికల కమిషన్ కుట్రలకు వ్యతిరేకంగా నాయకులందరు తమ స్వరం వినిపించాలని ఓట్ చోరికి వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు.
- Advertisement -


