Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్సన్ ఇంచార్జ్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన డోంగ్లి మహాజనసభ

పర్సన్ ఇంచార్జ్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన డోంగ్లి మహాజనసభ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
పర్సన్ ఇంచార్జ్ సిహెచ్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన శుక్రవారం నాడు డోంగ్లి సింగిల్ విండో 61వ మహాజనసభ నిర్వహించారు. ఈ మహాజనసభలో 1-10-2025 నుండి18-3-2026 వరకు జమ ఖర్చులను ఆమోదించారు. అదేవిధంగా గ్రాఫ్ లోన్స్ రెన్యువల్ ఆమోదం, నూతన మెంబర్షిప్ పంట రుణాలు ఇచ్చినవి ఆమోదం, వాయిదా మీరిన ఎస్ టి ఎల్ టీ లీగల్ నోటీసుల జారీ చేయుట గురించి ఆమోదం, 2024 25 ఆడిట్ రిపోర్ట్ ఆమోదం, ఇతర అంశంలో పర్సన్ ఇన్చార్జ్ అధ్యక్షుల వారి అనుమతితో చర్చలు జరిగాయి.

ఈ మహాజన సభకు హాజరైన మాజీ సింగిల్ విండో అధ్యక్షులు రామ్ పటేల్ కు అలాగే ఇటీవల నూతనంగా ఎన్నికైన మోగ సర్పంచ్ ఆలే బస్వంత్, దోతి సర్పంచ్ తోఫారే సంగ్రామ్, హసన్ టాక్లి సర్పంచ్ నక్కేవార్ దత్తు, మాదన్ హిప్పర్గా సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్, కు డోంగ్లి సింగిల్ విండో తరపున విండో కార్యదర్శి బాబురావు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ మహాజన సభకు వివిధ గ్రామాల రైతులు హాజరయ్యారు విండో సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -