– మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– నల్ల బాలుకు భరోసా
నవతెలంగాణ-పటాన్‌చెరు
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడొద్దని, ప్రతి ఒక్కరికి తనతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆరోపణలపై అరెస్టయ్యి బెయిల్‌పై తిరిగి వచ్చిన నల్ల బాలు (శశిధర్ గౌడ్)ను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పోచారం గ్రామంలో నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, నాయకులతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా శశిధర్ గౌడ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడే కేటీఆర్ కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకను చేసుకున్నారు. శశిధర్ గౌడ్ పిల్లలకు బహుమతులు అందించారు. వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలపై కార్యకర్తలు ఇంకా గట్టిగా నిలదీయాలని సూచించారు. తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కాగా, మాజీ మంత్రి కేటీఆర్ ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి భోజనం చేయడంతో ఎంతో భరోసానిచ్చినట్టు అయిందని బీఆర్‌ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. కేటీఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మాజీ కార్పొరేషన్ చైర్మెన్ బిక్షపతి, కార్పొరేటర్లు వి.సింధు ఆదర్శ్ రెడ్డి, మెట్టు కుమార్, మాజీ జెడ్పీటీసీలు శ్రీకాంత్ గౌడ్, బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భయపడకండి.. అండగా నేనున్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES