బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య
బిఆర్ఎస్ నాయకుని పరామర్శ..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి: అధైర్య పడకు పార్టీ అండగా ఉంటుందని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు జంగంపల్లి బిక్షపతి ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడగా బిఆర్ఎస్ నాయకులు గురువారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలను, నాయకులను బిఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న,తoగల్లపల్లి బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి జగన్, సిరిసిల్ల పాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి,నాయకులు పడగల రాజు, కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు,నందగిరి భాస్కర్ గౌడ్, కందుకూరి రామ గౌడ్, క్యారం జగత్,తిరుణారి భానుమూర్తి, నేరెళ్ళ అనిల్ గౌడ్, కొంగరి నరేష్ పాల్గొన్నారు.
అధైర్య పడకు.. అండగా ఉంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES