Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

- Advertisement -

– మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశెట్టి చంద్రశేఖర్ 
నవతెలంగాణ – బొమ్మలరామారం 

రైతులు కష్టపడి పండించిన పంటను దళారుల చేతుల్లో పెట్టి మోసపోవద్దని భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశెట్టి చంద్రశేఖర్ అన్నారు. శనివారం నవతెలంగాణ తో మాట్లాడుతూ…ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నేరుగా ధాన్యా న్ని తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు.రైతులను మోసగిస్తే దళారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -