Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళారులను నమ్మి మోసపోవద్దు: ఏపీఎం 

దళారులను నమ్మి మోసపోవద్దు: ఏపీఎం 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఏపీఎం ఎండీ పాషా, తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్ సూచించారు. బంగారు చెలిమి తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలకు రూ.2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. దాంతో పాటుగా సన్న రకం ధాన్యానికి క్వింటాలకు రూ. 500 అదనంగా బోనస్‌ కూడా చెల్లిస్తుందని పేర్కొన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, మద్దతు ధర కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో సీసీలు సుధాకర్, సుజాత, వీవో సంధ్యారాణి, వీవో అధ్యక్షురాలు జాటోత్ వినోద, బుక్ కీపర్ ధరావత్ రజిత, కంప్యూటర్ ఆపరేటర్ నూకల అనిల్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -