Monday, May 12, 2025
Homeకరీంనగర్బాధ పడుకుర్రి.. బాధ్యత నేను తీసుకుంటా: కేటీఆర్

బాధ పడుకుర్రి.. బాధ్యత నేను తీసుకుంటా: కేటీఆర్

- Advertisement -
  • – మహేష్ ను ఇండియా కు రప్పించి… అన్ని విధాలా ఆదుకుంటా
  • నవతెలంగాణ – తంగళ్ళపల్లి
  • అధైర్య పడొద్దు.. అండగా నేనుంటా అంటూ మహేష్ కు ధైర్యం చెప్పి, మనోళ్ళను పంపించి నీకు అండగా ఉండే విదంగా అన్ని రకాలుగా చూస్తానని మాజీ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశం పోయి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మండేపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త మంద మహేష్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మేల్యే కేటీఆర్ ఆదివారం పరామర్శించారు.సౌదీ అరేబియా దేశంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూన్న మహేశ్ తో విడియో కాల్ లో కేటీఆర్ మాట్లాడుతూ మహేష్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్వంత ఖర్చులతో ఇండియాకు రప్పిస్తాననీ మహేశ్ కు  భరోసానిచ్చారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -