నవతెలంగాణ – ఆలేరు
యుపీ ఏ వన్ ప్రభుత్వం హాయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజల కోసం తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కూడిన బృందం మంగళవారం నాడు మహాత్మా గాంధీ ఫోటోలను పట్టుకొని ప్రదర్శనగా మాత్మ గాంధీ విగ్రహ వద్దకు పెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం జి రాం జీ అనే పేరు పెట్టాలని చూస్తుందన్నారు.
స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించిన చరిత్ర బిజెపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఉందన్నారు.కానీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని పేరు లేకుండా చేయాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకానికి నిధులను కేటాయించడం తగ్గించి నావిషయం ప్రజలందరూ గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో నిరుద్యోగం ధరల పెరుగుదల విమాన ప్రయాణాల అంతరాయాలు రూపాయి విలువ పడిపోవడం లాంటి విషయాలు ఎన్నో ఉన్నా బిజెపి ప్రభుత్వానికి ఇవేవీ పట్టవు అన్నారు. మతం ద్వారా ప్రజల మధ్యన వైశ్యమ్యాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తుందన్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీల అందరూ పాల్గొన్నారు.



