విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మరుతుంది..
నవతెలంగాణ- డిచ్ పల్లి
ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న అధ్యాపకులను తొలగించొద్దని, వారికి బోధన అనుభవం చాలా ఉందని, వారిని తొలగిస్తే విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మరే అవకాశముందని విద్యార్థులు పేర్కొన్నారు. ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో పాత ఉపాధ్యాయులను కొనసాగించాలని విద్యార్థుల డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. 2014 నోటిఫికేషన్ ద్వారా నియమకం పొందిన అధ్యాపకులనే కొనసాగించాలని కోరారు. తప్పుడు విధానం వల్ల ఉపాధ్యాయులు నష్టపోతారని, దీంతో విలువైన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారు తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నోటిఫికేషన్ లోని 45 మంది అధ్యాపకులని కొనసాగించాలని యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కోరుతున్నాట్లు వివరించారు. 2014 నోటిఫికేషన్ నుంచి ఇప్పటివరకు ఆ అధ్యాపకులకు బోధన అనుభవంతోపాటు వారి ఆధ్వర్యంలో చాలామంది విద్యార్థులకి బంగారు భవిష్యత్తు పొందినట్లు దీనికంటే ఎక్కువ విద్యార్థులకు ఏమి కావాలని వారఅన్నారు.ఈ సమావేశంలో ఎన్ ఎస్ యు ఐ వైస్ ప్రెసిడెంట్ గూడూరు అరుణ్ తేజ, జనరల్ సెక్రెటరీ నవీన్, జాయింట్ సెక్రెటరీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
అధ్యాపకులను తొలగించొద్దు.. వారికి బోధన అనుభవం ఉంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



