Monday, December 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'మత్తు వద్దు బ్రో.. జీవితాలు చిత్తు'

‘మత్తు వద్దు బ్రో.. జీవితాలు చిత్తు’

- Advertisement -

31న ‘కల్చరల్‌ నైట్‌-2026’
మత్తు లేని సమాజమే లక్ష్యంగా టీపీఎస్కే, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శనలు


నవతెలంగాణ-సిటీబ్యూరో
నూతన సంవత్సర వేడుకల పేరుతో యువత మత్తుకు బానిసై జీవితాలను చిత్తు చేసుకోవద్దని, మత్తు లేని సమాజమే లక్ష్యంగా ఈనెల 31న ‘కల్చరల్‌ నైట్‌-2026’ నిర్వహిస్తున్నట్టు టీపీఎస్కే అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు తెలిపారు. టీపీఎస్కే, డీవైఎఫ్‌ఐ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో 31 సాయంత్రం 7 గంటలకు కళారూపాలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం ఎస్వీకేలోని టీపీఎస్కే హాల్‌లో టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావీద్‌, విజయ్, జిల్లా నాయకులు సునీల్‌, రాజయ్య, సందీప్‌ తదితరులతో కలిసి ఆయన సంబంధిత గోడ పత్రికను ఆవిష్కరించారు. యువత విజ్ఞానం, వినోదం వైపు దృష్టి సారించేలా ‘మత్తు వద్దు బ్రో.. మత్తు వైపు కాదు.. ఆటపాటల సృజనోత్సవం వైపు రండి’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు భూపతి వెంకటేశ్వర్లు తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, యువత మత్తు వైపు చూడకుండా ఈ కల్చరల్‌ నైట్‌లో పాల్గొనాలని జావీద్‌ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -