దినోత్సవ సందర్భంగా ఫ్రూడెన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఒక గుండె తపనను కూడా మిస్ కావొద్దు అనే నినాదంతో ముందుకు వెళ్దామని ఫ్రూడెన్స్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ గౌతం రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా (29 సెప్టెంబర్ 2025) ప్రూడెన్స్ హాస్పిటల్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సంవత్సరానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంశం “డోంట్ మిస్ ఏ బీట్ ” (ఒక గుండె తపనను కూడా మిస్ కావద్దు) – గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్తల ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. ఈ సందర్భంగా గుండె వైద్య నిపుణులు డా. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా పెట్టుకోవడం అత్యవసరమని చెప్పారు.
ఆయన తరచూ హెల్త్ చెక్-అప్స్ చేయించుకోవడం, జంక్ ఫుడ్‌ను దూరంగా ఉంచడం, సమతుల్యమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ఆరోగ్యకరమైన గుండె అనేది ఆరోగ్యకరమైన జీవితానికి మూలం, చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి అని ఆయన అన్నారు. అదేవిధంగా డా. భైరవ నాథ్, డా. కిరణ్, డా. జక్క రవి మాట్లాడుతూ.. నిజామాబాద్ ప్రజలకు ప్రూడెన్స్ హాస్పిటల్స్ 20కి పైగా విభాగాలు, పూర్తి స్థాయి కన్సల్టెంట్లతో ఒకే చోట అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అదనంగా ఇటీవల ఆంకాలజీ విభాగంను పూర్తి స్థాయి కన్సల్టెంట్‌తో ప్రారంభించి, ప్రత్యేక వైద్య సేవలను మరింత బలోపేతం చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా. దివ్య భైరవ, డా. మయూరి, డా. విన్నూత, డాక్టర్.దీప్తి డా. శ్రావ్య, బొబ్బిలి నరేష్ రావు, డా. శాంతి సింగ్, డా. స్నేహిత, మంజుల, రాజ్ కిరణ్ తో పాటు ఆసుపత్రి సిబ్బంది , ప్రజలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
గుండె తపనను కూడా మిస్ కావొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES