Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఫ్యాన్స్‌కు డబుల్‌ బొనాంజా

ఫ్యాన్స్‌కు డబుల్‌ బొనాంజా

- Advertisement -

పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ’ చిత్ర బందం అభిమానులకు డబుల్‌ బొనాంజా ఇచ్చింది. అద్భుతమైన కొత్త పోస్టర్‌తో పాటు, ‘హెచ్‌బిడి ఓజీ- లవ్‌ ఓఎంఐ’ పేరుతో ఓ సంచలనాత్మక గ్లింప్స్‌ను విడుదల చేసింది.
వింటేజ్‌ లుక్‌లో పవన్‌ కళ్యాణ్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్న పోస్టర్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పోస్టర్‌ రిలీజ్‌తో సామాజిక మాధ్యమాల్లో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
పవన్‌ కళ్యాణ్‌ను ఈ తరహా లుక్‌లో చూసి చాలా కాలం అయిందని అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పవర్‌స్టార్‌ను ఇంత శక్తివంతమైన, ఆకర్షణీయమైన శైలిలో చూపించినందుకు అందరూ దర్శకుడు సుజీత్‌, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
‘ఓజీ’ అనే టైటిల్‌కి తగ్గట్టుగానే పోస్టర్‌ కూడా ఎంతో శక్తివంతంగా ఉంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. తాజా గ్లింప్స్‌లో ఇమ్రాన్‌ హష్మీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్‌ కళ్యాణ్‌ని ఢ కొట్టే బలమైన పాత్రలో ఆయన కనువిందు చేయనున్నారు. ‘ఓజీ’ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్‌, గ్లింప్స్‌, పాటలు కట్టిపడేశాయి. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ‘ఓజీ’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ లుక్‌, అద్భుతమైన విజువల్స్‌, సంగీతం, సంభాషణలు ఇలా ప్రతి అంశం సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌, ప్రకాష్‌ రాజ్‌, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad