రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ వరంగల్ ఎంపీ కడియం కావ్యకు డబుల్ ఓట్లున్నాయని బీఆర్‌ఎస్ విమర్శించింది. సోమవారం హైరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్‌ను బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ నాయకులు లలితారెడ్డి, నాయకులు కిశోర్‌గౌడ్ కలిసి ఫిర్యాదు చేశారు. కడియం కావ్యకు రెండుచోట్ల ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఓట్లున్నాయని వారు విమర్శించారు. వరంగల్ ఎంపీగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు తొర్రూరు మున్సిపాల్టీలో ఎక్స్‌అఫిషియో సభ్యులు గా నమోదు చేసుకున్నారని వివరించారు. ఇది ఎన్నిక కోడ్ నిబంధనలకు విరుద్ధ మని అన్నారు. ఈ విషయంలో కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది న్యాయ పరంగా చెల్లదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్విని యోగానికి పాల్పడుతున్నదని అన్నారు.
జనగామలో ఫాతిమాపై వేధింపులు ఆపాలి
జనగామ మున్సిపల్ కౌన్సిలర్ ఫాతిమాపై కాంగ్రెస్ నాయకులు, పోలీసులు వేధింపులు ఆపాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మైనార్టీ కమిషన్ చైర్మెన్ తారీక్ అన్సారీని సోమవారం హైరాబాద్‌లో వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మెన్ మసీ యుల్లా ఖాన్, బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు ముఖీబ్ చందా, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కె కిశోర్‌గౌడ్, బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ సభ్యులు లలితారెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్యకు డబుల్ ఓట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



