నవతెలంగాణ – చండూరు
చండూరు మున్సిపాలిటీ పరిధిలోని లక్కినేని గూడెంకీ చెందిన ఏనుగు అమరేందర్ రెడ్డి, మాధవి దంపతుల కుమారుడు యశ్వంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాలలో వనపర్తి మెడికల్ కాలేజీ నందు ఎంబీబీఎస్ సీటు సాధించాడు. మెడికల్ సీట్ సాధించిన యశ్వంత్ రెడ్డిని స్థానిక గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు బుధవారం గాంధీజీ పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏనుగు అమరేందర్ రెడ్డి గతంలో బైక్ మెకానిక్ చేసి, ప్రస్తుతం దంపతులిద్దరూ వ్యవసాయం చేస్తూ తనకున్న ఇద్దరు పిల్లలను కష్టపడి చదివించారని, నాలుగు సంవత్సరాల క్రితం తమ కూతురు ఏనుగు హారిక టిఆర్ఆర్ కాలేజీ పటాన్ చెరువులో ఎంబీబీఎస్ సీటు సాధించి, ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తుందని, ఇప్పుడు కుమారుడు యశ్వంత్ రెడ్డి మెడికల్ సీటు సాధించడం గర్వకారణమన్నారు.
ఇద్దరూ విద్యార్థులు పదవ తరగతి వరకు గాంధీజీ విద్యాసంస్థల్లో చదివారని తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకొని అందరు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు. భవిష్యత్తులో వీరిద్దరూ మంచి డాక్టర్లుగా పేరు ప్రఖ్యాతులు సాధించి, ఈ ప్రాంతానికి, సమాజానికి సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఏనుగు యశ్వంత్ రెడ్డిని అభినందించిన డా.కోడి శ్రీనివాస్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES