Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా డ్రైవర్ దినోత్సవ వేడుకలు

ఘనంగా డ్రైవర్ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి:  బులోరా డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్స్ దినోత్సవ వేడుకలను గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకున్నారు. డ్రైవర్స్ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా బులోరా డైవర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశము సంఘం అధ్యక్షులు మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్స్ కేక్ కట్ చేసుకుని సమావేశం జరిపి డ్రైవర్ల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు వనపర్తి జిల్లా బులోరా డ్రైవర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు పుట్ట ఆంజనేయులు పాల్గొని ప్రసంగిస్తూ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కు సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్నారు.

గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రమాద బీమా పథకాలు ఇవ్వాలని, పిఎఫ్. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు. వాటిని రద్దు చేయాలని, డ్రైవర్లకు వ్యతిరేకంగా ఉన్న భారత్ న్యాయ సహిత చట్టంలోని సెక్షన్ 106 సబ్ సెక్షన్ 1 అండ్ 2 సఫరించాలని డిమాండ్ చేశారు. ఈ సెక్షన్ ద్వారా డ్రైవర్లు ప్రమాదవశాత్తు ఎవరినైనా యాక్సిడెంట్లుగా చంపితే వారికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, ఏడు లక్షల రూపాయలు జరిమానా వేస్తున్నారని ఇది అన్యాయం అన్నారు. దాన్ని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.

మోటార్ వెహికల్ చట్టం 2019 ప్రకారం కార్పొరేట్ కంపెనీలకు ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని అప్పజెప్పేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైందని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. డ్రైవర్లకు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం అన్యాయం అన్నారు. ఈ సమావేశంలో వనపర్తి జిల్లా బులోరా డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఇమ్రాన్, గంధం కృష్ణయ్య, రామకృష్ణ, బుచ్చన్న, కరుణాకర్, తిరుపతి, రాములు, నరసింహ, అబ్దుల్ ఖాన్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad