Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు 

మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు 

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని కొన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బుధవారం విద్యార్థులకు అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ యువత మాదక దవ్యాలకు అలవాటు పడి ఆరోగ్యంతో పాటు జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడినవారు విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిల్లో అఘైత్యాలకు  పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారి ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్, ఫిజికల్ డైరెక్టర్ రమేష్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -