– విద్యాశాఖ సంచాలకులకు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి హరీశ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు. టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే పదివేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరారు. మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. డైట్, బీఎడ్ లెక్చరర్ పోస్టులను, డిప్యూటీఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేయాలని పేర్కొన్నారు. వచ్చే టెట్ నుంచి మ్యాథ్స్, సైన్స్‌కు వేర్వేరు ప్రశ్నాపత్రాలను ఇవ్వాలని కోరారు. భాషాపండితుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు వీరబాబు, సాయి, కవిత, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES