- Advertisement -
అలా ఏం ఉండదు..
మోయలేనంత బరువుగా తూచలేనంత అధికంగా
ఇలా కూడా ఉండదు.. చెప్పలేనంత మధురంగా
హృదయంలో మిగిలిపోయేంత ఉల్లాసంగా
అప్పుడప్పుడు ఊరిస్తుంది
కొత్త నెత్తుటి పరుగులా ఊగిస్తుంది
అమాంతం దుఃఖ సంద్రంలోకి తోసేసి మోసగిస్తుంది
అంతలోనే అరచేతుల్లోకి తీసుకొని లాలిస్తుంది
జీవితమంటే ఇంతే.. ఎంతో ఉందని అడుగు వేసేంతలో
పాదానికి శూన్యమై తగులుతుంది
అంతా అయిపోయిందని రెప్పలు వాల్చుకుంటే
ఇంద్రధనస్సు వాకిళ్ళు తెరిచి
కలల ప్రపంచంలోకి ప్రేమగా విసిరికొడుతుంది
- సునీత గంగవరపు, 9494084576
- Advertisement -


