సాహిత్య స‌మాచారం

కె.శివారెడ్డి కవిత్వస్ఫూర్తి పురస్కారం-2024
కె.శివారెడ్డిగారి పేరిట స్ఫూర్తి పురస్కారాల కోసం 35 సంవత్సరాల లోపు కవుల నుండి 2023 సంవత్సరంలో ముద్రితమైన కవితాసంపుటాలను ఆహ్వానిస్తున్నారు. మూడు ప్రతులను జులై 10వ తేదీలోపు ఇబ్రహీం నిర్గుణ్‌, 15.5.112/1/బి, స్కైలైన్‌ టవర్స్‌ ఎదురుగా, చైతన్యనగర్‌, ఖమ్మం-507002, తెలంగాణ చిరునామాకు పంపాలి. వివరాలకు: 9063696968.
పాలపిట్ట దాశరథి శతజయంతి సంచిక కోసం…
జులై 22న దాశరథి కష్ణమాచార్యులు శతజయంతి సంవత్సరం ఆరంభ సందర్భంగా సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా మొదలైన అన్ని రంగాలలో దాశరథికి సంబంధించిన ప్రతి అంశాన్ని రికార్డు చేయాలని పాలపిట్ట భావిస్తున్నది. దాశరథి కష్ణమాచార్యులతో సాహిత్య సంబంధం గలవారు, వారితో తాము పాల్గొన్న, కలిసి దిగిన ఫొటోలను, వారు రాసిన ఉత్తరాలను, దాశరథి తొలినాళ్ళ పుస్తకాల కవర్‌ పేజీలను పంపించవలసిందిగా కోరుతున్నారు. రచనలు, సూచనలు, ఫొటోలు పంపించవలసిన చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట, ఫ్లాట్‌ నెం: 2, ఎం.ఐ.జి-2, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044. వివరాలకు : 9490099327.
గీతమ్‌ పురస్కారం కొరకు…
గీతమ్‌ సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ కథా సంపుటాల పోటీ నిర్వహించి గీతమ్‌ పురస్కారం నిర్వహిస్తున్నారు. పోటీ కొరకు 2016 – 2024 మధ్య కాలంలోని సంపుటాలను జులై 5 లోపు మూడు కాపీలను ఓలేటి వెంకటేశ్వర రావు, అధ్యక్షులు, గీతమ్‌ సాహితీ సంస్థ, పిఠాపురం – 533450 చిరునామాకు పంపాలి.
శివేగారి దేవమ్మ కథా పురస్కారాలు – 2023
శివేగారి దేవమ్మ కథా పురస్కారాల కొరకు 2022, 2023 లో ప్రచురించిన కథా సంపుటాలు, బాలల కథా సంపూటాల పురస్కారాల ఫలితాలు వెలువరించారు. మునిసురేష్‌ పిళ్లె (గారడీ వాడు), కుసుమంచి నాగేంద్ర (చందమామలో మేనమామ), ఆర్‌.సి. కష్ణస్వామి రాజు (కార్వేటినగరం) రచించిన కథా సంపుటాలు ఎంపిక అయ్యాయి. – కె.వి. మేఘనాథ్‌ రెడ్డి, 6300318230
ఏడు రంగుల జండా పుస్తకావిష్కరణ
ఈ నెల 13 వ తేదీ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో అమరవాది నీరజ రచించిన ‘ఏడు రంగుల జండా’ పుస్తకావిష్కరణ జరుగుతుంది. భాషా సాంస్కృతిక శాఖ, అమరవాది ఫౌండేషన్‌ సంయుక్త నిర్వహణలో ఆచార్య సి.మృణాళినికి శ్రీమతి అమరవాది హైమవతీ- డా.ఎ.సి.ఎం.ఎల్‌.ప్రసాద్‌ సాహిత్య పురస్కారం, గరిపెల్ల అశోక్‌కి డా||ఎ.సి.ఎం.ఎల్‌.ప్రసాద్‌-శ్రీమతి హైమవతి బాలసాహిత్య పురస్కారం అందజేస్తారు. ఈ సభలో మణికొండ వేదకుమార్‌, డా||పత్తిపాక మోహన్‌, డా||జుర్రు చెన్నయ్య, చొక్కాపు వెంకటరమణ పాల్గొంటారు.

Spread the love