- Advertisement -
నవతెలంగాణ-చందుర్తి
ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బండపల్లి గ్రామానికి చెందిన మాల్యాల సృజన్ (18) ఈత సరద కోసం ఊర చెరువు లోకి మధ్యాహ్నం వెళ్ళాడు. ఈ క్రమంలో నీటిలో చాలా లోతులోకి వెళ్ళి, నీటిలో మునిగి పోయాడు. స్థానికులు గమనించి కాపాడే లోగా అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించారు. ఈ ఘటన పై మృతుని తండ్రి నర్సయ్య పిర్యాదు మేరకు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



