Wednesday, August 19, 2026
E-PAPER
Homeజాతీయంఅమిత్ షా సభకు రావాలి

అమిత్ షా సభకు రావాలి

- Advertisement -
  • రాజ్యసభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీక్ ను వ్యతిరేకిస్తూ గత నెల జూలై 20న జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. శాంతియుతంగా సాగుతున్న పార్లమెంట్ మార్చ్ పై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈనేపథ్యంలో రాజ్యసభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే అమిత్ షా పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.. ఆ సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉభయ సభల్లో మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకుంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం అసలు సమస్యలపై చర్చ పెట్టకుండా కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు.ఈ విషయంపై హోం మంత్రి సభకు వచ్చి ప్రకటన చేసేలా చూడాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును కోరారును అని ఖర్గే తెలియజేశారు.

“ఇది ఒక సాధారణ అభ్యర్థన, పైగా ఇది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశం. వారు ఎందుకు సభకు హాజరుకావడం లేదో తెలియదు. ఈ ఘటనపై హోం మంత్రి సభకు వచ్చి మాట్లాడాలని రాజ్యసభ చైర్మన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి సూచించారు. ఈ సమస్యను పరిష్కరించే అధికారం ఒక్క రిజిజుకు మాత్రమే లేదు; ఆయన కేవలం విషయాన్ని తెలియజేస్తారు, ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగిపోతుంది.” అని ఖర్గే విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -