Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జన గణనతో ప్రజాభివృద్ధికి పునాది

జన గణనతో ప్రజాభివృద్ధికి పునాది

- Advertisement -

వర్ధన్నపేటలో మార్నింగ్ వాక్ మానవహారం..
పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
నవతెలంగాణ-వర్ధన్నపేట

ఖచ్చితమైన జనగణనతోనే అభివృద్ధికి బలమైన పునాది అని జన గణనకు అందరూ సహకరించి విజయవంతం చేయాలని, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు లు అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో రాయపర్తి వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు చెందిన అధికారులతో మార్నింగ్ వాక్ ప్రజలకు అవగాహన కల్పించారు కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనంతరం ఎమ్ ఎమ్ ఆర్ గార్డెన్లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ,స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు లు మాట్లాడారు.

గ్రామ, మండలం వరంగల్ జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే జనాభా గణన కచ్చితంగా అమలు చేయాలన్నారు. జనాభా గణన అనేది కేవలం లెక్కలు సేకరించే ప్రక్రియ మాత్రమే కాకుండా దేశ భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే మహత్తర కార్యక్రమమని అన్నారు. ప్రజలు జనాభా గణన సిబ్బందికి పూర్తి సహకారం అందించి ఖచ్చితమైన వివరాలు ఇవ్వాలని కోరారు. అనంతరం జనగణన నిర్వహణలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ లు పరిశీలించారు.

కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డిఆర్ఓ విజయ లక్ష్మి, ఆర్డీవో సుమ , వర్ధన్నపేట తహసిల్దార్ విజయ్ సాగర్ ,పర్వతగిరి తహసీల్దార్ వెంకటస్వామి,రాయపర్తి తహసిల్దార్ శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్ జోనా, జిల్లా అధికారులు , వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి వైస్ చైర్మన్ శుభారాణి, పట్టణ కౌన్సిలర్ ప్రజా ప్రతినిధులు మూడు మండలాలకు చెందిన సర్పంచులు జిపిఓలు పంచాయతీ కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రజలు మహిళలు యూత్ సభ్యులు , ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -