Thursday, August 6, 2026
E-PAPER
Homeజాతీయంబిల్లులపై చర్చలు లేకుండానే ఆమోదం

బిల్లులపై చర్చలు లేకుండానే ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో మోడీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడను ప్రదర్శిస్తోంది. ఉభయ సభల్లో ప్రవేశపెట్టే బిల్లులపై ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదం పొందుతున్నాయి. గత జూలై 20న జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీస్ ల లాఠీచార్జీను, వారి డిమాండ్లకు సంబంధించిన విషయంలో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపుతున్నప్పటికీ, ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. అదే విధంగా అయోధ్య రామ్ మందిర్ విరాళాల చోరీ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, సభలో చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలను మోడీ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. సభలో పలు బిల్లులపై సమగ్ర చర్చలు జరగకుండానే ఆమోదం పొందుతున్నాయి.

తాజాగా పన్నులు- ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026’ను లోక్‌సభ గురువారం ఆమోదించింది. ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007, ‘ఆదాయపు పన్ను చట్టం-2025, ‘ఆర్థిక చట్టం-2026’లలో సవరణలు చేయడానికి ఉద్దేశించిన ఈ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టగా, ఎటువంటి చర్చ లేకుండానే వాయిస్ ఓటు ద్వారా ఆమోదం పొందింది. పలు రోజుల క్రితం యాంటీ పేపర్ యాక్ట్ పై కూడా ప్రతిపక్షాలు పలు సందేహాలు లెవనెత్తాయి. కానీ మోడీ ప్రభుత్వం హడవిడీగా సదురు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -