– కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు
– ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
నవతెలంగాణ-కుభీర్
కుభీర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. స్థానిక వివేకానంద చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, విట్టల్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు భారీగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులతో కలసి కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఆయన నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రజా నాయకుడని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కేక్ కట్ అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కళ్యాణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ హైమద్, మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కందూరు సాయినాథ్, మాజీ జెడ్పిటిసి చవాన్ శంకర్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ రాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ మాజీ సర్పంచ్ పి విజయ్ కుమార్ లతో పాటు మండల కాంగ్రెస్ నాయకులు,సూది రాజన్న నాగలింగం, గంగయ్య , ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, విట్టల్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



