- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు స్త్రీనిధి ద్వారా ప్రత్యేక రుణ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎలక్ట్రిక్ ఆటోలు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసేందుకు తక్కువ వడ్డీపై రుణాలు పొందవచ్చు. ఈ-ప్యాసింజర్ ఆటో కొనుగోలుకు రూ.2.74 లక్షలు, ఈ-ట్రాలీ ఆటోకు రూ.3.13 లక్షల వరకు రుణం 60 నెలల్లో వార్షిక 11 శాతం వడ్డీతో చెల్లించాలి. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనానికి రూ.1 లక్ష వరకు రుణం 48 నెలల్లో చెల్లించే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా మహిళల ఆదాయ మార్గాలు విస్తరించడంతో పాటు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది.
- Advertisement -


