Thursday, August 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పీజీలో స్టేట్ రెండో ర్యాంక్ సాధించిన మండల వాసి

పీజీలో స్టేట్ రెండో ర్యాంక్ సాధించిన మండల వాసి

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం
కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల్లో సోషియాలజీ సబ్జెక్టులో జన్నారం మండలం బాదంపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల సౌమ్యశ్రీ రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు. సౌమ్య శ్రీ మండల కేంద్రంలోని లిటిల్ హార్న్స్ పాఠశాలలో చదువుకొని 10 వ తరగతి ఫలితాల్లో 10 జీపీఏ, ఇంటర్మీడియట్ కరీంనగర్ ట్రినిటీ కళాశాలలో చదువుకొని 97శాతం, డిగ్రీ సెయింట్ ఫ్రాన్సిస్ హైదరాబాద్ లో పూర్తి చేశారు. భవిష్యత్తు లో సివిల్ సర్వీసెస్ అధికారిగా సేవలందించడమే లక్ష్యమని అన్నారు. రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంకు సాధించిన సౌమ్యశ్రీని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మండల వాసులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -