నవతెలంగాణ-హైదరాబాద్: ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS)పై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రస్తుత సీజన్‌లో అధికారికంగా ప్లేఆఫ్స్ (Playoffs) బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ టోర్నీలో వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ 40 బంతుల్లో 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అదరగొట్టగా, ఓపెనర్ విరాట్ కోహ్లీ (58) బాధ్యతాయుత అర్ధసెంచరీతో రాణించాడు. దేవదత్ పడిక్కల్ (45), ఆఖర్లో టిమ్ డేవిడ్ (28) వేగంగా ఆడటంతో పంజాబ్ ముందు కొండంత లక్ష్యం నమోదైంది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. శశాంక్ అర్ధ సెంచరీతో రాణించగా,కన్ఓన్లీ(35), సూర్ యానష్(35), స్టోన్సీ(37) పోరాడినా ఫలితం దక్కలేదు.ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ టోర్నీలో వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది.



