Friday, August 7, 2026
E-PAPER
Homeఖమ్మంభద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారుకు ప్రమాదం

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారుకు ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో టోల్‌ప్లాజా ప్రాంగణంలో డీసీఎం వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎమ్మెల్యే కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు సైడ్‌ మిర్రర్‌, డోర్‌ దెబ్బతిన్నాయి. అయితే కారులో ఉన్న ఎమ్మెల్యే, ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -